8వేలకు పైగా క్లర్క్ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | SBI Clerk Notification 2023

SBI Recruitment 2023 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీ ఖాళీలతో క్లర్కు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 8 వేలకు పైగా జూనియర్ అసోసియేట్స్ ( క్లరికల్ కేడర్ ) పోస్టులను భర్తీ చేయనున్నారు.

8వేలకు పైగా క్లర్క్ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | SBI Clerk Notification 2023

SBI Clerk Notification 2023 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీ ఖాళీలతో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 8,773 జూనియర్ అసోసియేట్స్ ( క్లరికల్ కేడర్ ) పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ హైదరాబాద్ సర్కిల్లో 525; ఆంధ్రప్రదేశ్ అమరావతి సర్కిల్లో 50 ఖాళీలు ఉన్నాయి. సొంత రాష్ట్రంలోనే రాత పరీక్ష ఉంటుంది. తెలుగు భాష కచ్చితంగా వచ్చి ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయసు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు:

జూనియర్ అసోసియేట్స్ ( క్లరికల్ కేడర్ )మొత్తం పోస్టుల సంఖ్య : 8,773.హైదరాబాద్ సర్కిల్ (తెలంగాణ) లో : 525 పోస్టులు.అమరావతి సర్కిల్ (ఆంధ్ర ప్రదేశ్) లో : 50 పోస్టులు.

విద్యార్హతలు:

ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి:

2023 ఏప్రిల్ 1వ తారీఖు నాటికి 20 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.SC/ ST అభ్యర్థులకు ఐదేళ్లు, BC అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు:

నెలకు రూ. 19,900/- జీతం ఉంటుంది.

ఎంపిక విధానం:

ఆన్లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్), స్థానిక భాషా పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ప్రిలిమినరీ పరీక్ష:

ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయంలో ఒక గంట. నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానికి 1/4 మార్కుల కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు.

మెయిన్ ఎగ్జామ్:

మెయిన్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నల సంఖ్య 190. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు.. 50 మార్కులు; జనరల్ ఇంగ్లీష్ 40 ప్రశ్నలు.. 40 మార్కులు; క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు.. 50 మార్కులు; రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు.. 60 మార్కులకు పరీక్షలు జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:

SBI Clerk Notification కు సంబంధించి అనంతపూర్, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూల్, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం, రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్.

దరఖాస్తు విధానం:

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు:

రూ. 750/- ఫీజు చెల్లించాలి. SC/ ST అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:

2023 డిసెంబర్ 7వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఈ క్రింది లింకుపై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Notification Link

Official Website

✅ ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Whatsup Channel Link

1 thought on “8వేలకు పైగా క్లర్క్ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | SBI Clerk Notification 2023”

Comments are closed.